వరల్డ్ కప్కు ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం.. ప్రేక్షకులకు నో ఎంట్రీ..

By :  Krishna
Update: 2023-09-22 03:18 GMT

వరల్డ్ కప్కు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ స్టేడియంలో రెండు వార్మప్, మూడు మెయిన్ మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో హెచ్సీఏ స్టేడియాన్ని సుందరంగా రెడీ చేస్తోంది. స్టేడియంలో పైకప్పు, కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తోంది. స్టేడియంలోని సౌత్ సైడ్ లో ఉన్న పైకప్పు గతంలో వర్షాలకు ఎగిరిపోవడంతో దాని స్థానంలో కొత్తదాన్ని బిగించారు. ఇప్పటికే కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు.

మొదటి వార్మప్‌ మ్యాచ్‌కు భద్రతపై ఇంకా చర్చ జరుగుతోందని హెచ్సీఏ సీఈవో సునీల్ తెలిపారు. ‘‘39 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచకప్‌ వరకు 10 నుంచి 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తాం. ఈ టోర్నీ తర్వాత మొత్తం మార్చేస్తాం. దక్షిణం వైపు పైకప్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తూర్పు వైపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ వైపు పైకప్పు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. ప్రపంచకప్‌ పూర్తయ్యాక దీన్ని కూడా ఏర్పాటు చేస్తాం’’ అని సునీల్‌ చెప్పారు.

ఇక ఈ నెల 29న ఉప్పల్‌లో జరగాల్సిన న్యూజిలాండ్‌ - పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల నేపథ్యలో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని హెచ్‌సీఏకు రాచకొండ పోలీసులు సమాచారమిచ్చారు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్కు బుక్ మై షో ద్వారా ఇప్పటికే టికెట్లను విక్రయించారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బుక్ మై షోక్ ఈ మ్యాచ్కు టికెట్లు కొన్నవాళ్లకు డబ్బులు రిటర్న్ చేయాలని హెచ్సీఏ ఆదేశించిం


Tags:    

Similar News