IND vs ENG : ఉప్పల్లో టెస్ట్ మ్యాచ్ టికెట్ల.. స్టూడెంట్స్తో పాటు వారికి కూడా ఫ్రీ..!

Byline :  Bharath
Update: 2024-01-15 02:46 GMT

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ మేరకు టికెట్ల అమ్మకాలను ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు హెచ్ సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) తెలిపింది. పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌లో టికెట్లను విక్రయించనున్నారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆన్ లైన్ తో పాటు.. జింఖానా గ్రౌండ్స్ లోనూ అమ్మనున్నారు. ఆన్‌లైన్‌ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు.. 22వ తేదీ నుంచి ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి, తమ టికెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వారికి ఫ్రీ ఎంట్రీ:

ఉప్పల్ మ్యాచ్ కు సంబంధించి 25 వేల కాంప్లిమెంటరీ పాసులను ఇప్పటికే స్కూల్ పిల్లలకు కేటాయించారు. వారికి ఉచిత భోజనం కూడా అందిస్తామని హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. స్కూల్ స్టూడెంట్స్ తో పాటు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను గణతంత్ర దినోత్సవం నాడు ఉచితంగా మ్యాచ్ ను అనుమతిస్తామని చెప్పారు. ఆసక్తిగలవారు ఈనెల 18వ తేదీ లోపు సంబంధిత విభాగాధిపతితో సంతంకం చేయించిన లెటర్ ను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్ సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని సూచించారు. ఈ మ్యాచ్ కు సంబంధించి.. కనీస టికెట్ ధర రూ. 200 కాగా.. గరిష్టంగా రూ.4 వేలుగా ఉంది. సామాన్యుల‌ను దృష్టిలో పెట్టుకుని, అంద‌రికి అందుబాటులో ఉండేలా ఈ ధ‌ర‌లు నిర్ణ‌యించారు. 




Tags:    

Similar News