India vs England : ముగిసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్..భారత్ టార్గెట్ ఎంతంటే?

Update: 2024-01-28 06:37 GMT

(India vs England) హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆలౌటైంది. కాగా ఒలీపోప్‌ 196 పరుగుల వద్ద ఔటై డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టార్గెట్ 231 పరుగులు ఉంది. టెస్ట్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేయగా..భారత్ 436 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఓలీ పోప్‌ అద్భుత పోరాటంతో తమ జట్టును కాపాడాడు. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్‌ 3, జడేజా 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ సాధించారు. దీంతో భారత్‌ లక్ష్యం 231 పరుగులకు చేరింది. 


Tags:    

Similar News