కప్ తీసుకరండి కెప్టెన్.. టీమిండియాకు వెంకటేష్ ఆల్ ది బెస్ట్..

By :  Krishna
Update: 2023-09-17 09:46 GMT

ఆసియా కప్ తుదిపోరులో భారత్ - శ్రీలంక తలపడుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫైనల్‌లో మూడుసార్లు ఓడిపోయింది. అది కూడా శ్రీలంకపైనే కావడం టీమిండియా అభిమానులనును ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, ఈరోజు జరగనున్న ఫైనల్స్ను టీమిండియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియాకు విక్టరీ వెంకటేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కప్ గెలిచి తీసుకరండి కప్టెన్ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ బ్లూ జెర్సీలో ఉన్న మన అబ్బాయిలందరికీ చీరింగ్. ట్వీట్ కప్ను తీసుకురండి కెప్టెన్’’ అని ట్వీట్ చేశారు. దీనికి రోహిత్ శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.

Tags:    

Similar News