Rinku Singh: సిలిండర్లను మోస్తున్న స్టార్ క్రికెటర్ తండ్రి.. వీడియో వైరల్
ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయర్ రింకూ సింగ్. భారత జట్టు తరఫున అడుతూ ఇప్పటికే చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటున్నాడు. అయితే, టీమిండియా సూపర్ ఫినిషర్ గా ఎదుగుతున్న ఈ యంగ్ స్టార్ రింకూ సింగ్ తండ్రికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రింకూ సింగ్ తండ్రి ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నాడు. గతంలో ఆయన చిన్న ట్రక్కు ద్వారా గ్యాస్ సిలిండర్లను సప్లై చేసేవారనే విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు స్టార్ క్రికెటర్‌గా మారినప్పటికీ తన వృత్తిని మాత్రం వదల్లేదు. తన కుమారుడు టీమిండియాలో స్టార్ గా ఎదుగుతున్నా.. గర్వానికి పోకుండా ఇంకా తమకు జీవనం కొనసాగించడానికి తోడుగా ఉన్న పనిని కొనసాస్తున్నారు. రింకూ సింగ్ తండ్రి సిలిండర్లు మోస్తూ పని చేస్తున్న ఆ వీడియో పై కామెంట్లు వెల్లువెత్తుతుండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Rinku Singh's father is seen supplying gas cylinders, Even as Rinku plays for India, his father continues his work as a gas cylinder provider.
— Vipin Tiwari (@Vipintiwari952_) January 26, 2024
Hardworking family 👏 pic.twitter.com/pjOrXOwG1K
తన తండ్రి ఇలా పనిచేయడంపై గతంలోనే రింకు సింగ్ స్పందించాడు. ‘‘ఈ ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోమని నాన్నకు ఎన్నోసార్లు చెప్పా. ఆయన నా మాట అసలు వినలేదు. ఎవరైనా జీవితమంతా పని చేయాలనుకుంటే.. వారిని ఆ పనిని మానుకోమని చెప్పడం ఎంతో కష్టం’’ అని అన్నాడు. ‘‘మీ ఫ్యామిలీ సూపర్’’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ ఇటీవలి కాలంలో భారత క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ మంచి గుర్తింపు సాధించాడు. టీ20 మ్యాచ్ లో ఫినిషర్ గా తన పాత్ర పోషిస్తున్న రింకూ సింగ్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఐపీఎల్ లో వరుసగా 5 సిక్సర్లు బాది జట్టుకు అసాధ్య విజయాన్ని అందించిన రింకూ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి నిలకడగా రాణిస్తున్నాడు.