ప్లీజ్ అలాంటి వార్తలు నమ్మకండి: విరాట్ కోహ్లీ

Update: 2023-08-12 07:05 GMT

విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అందరికీ సొంత దేశంలో ఫ్యాన్స్ ఉంటే.. విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ప్రపంచంలోని టాప్ ఐదుగురి ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 256 మిలియన్ (25 కోట్లకు పైగా) ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీ నెట్ వర్త్ కూడా భారీగా పెరిగింది. ప్రపంచంలోని టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్ అయ్యాడు. ప్రమోషన్స్ ఇస్తూ.. ఏడాదికి కొన్ని కోట్లు సంపాధిస్తున్నాడు. తాజాగా హోపర్‌ హెచ్‌క్యూ అనలిటిక్స్ సంస్థ గ్లోబల్ సూపర్ స్టార్ల ఆదాయ జాబితాను విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నట్లు.. ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ కు రూ.11.45 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో క్రిస్టియానో రోనాల్డో.. ఒక్క పోస్టుకు రూ.26.75 కోట్లు, రెండో స్థానంలో లియోనెల్ మెస్సీ 21.49 కోట్లు, తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రూ.4.40 కోట్లు తీసుకుంటున్నారని తెలిపారు. దీంతో ఈ వార్త మీడియాలో హల్ చల్ చేసింది. కాగా, దీనిపై ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ స్పందించాడు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, వాటిని నమ్మొద్దని సూచించాడు. ‘జీవితంలో నేను సంపాదించిన ప్రతి పైసకు కృతజ్ఞడిగా ఉన్నా. అయితే, నా సోషల్ మీడిచా సంపాదన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు.

Tags:    

Similar News