Virat Kohli : కలిసొచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వ్యూయర్షిప్ రికార్డులు బ్రేక్

Byline :  Kiran
Update: 2023-10-23 10:49 GMT

వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఒకవేళ కోహ్లీ సెంచరీ చేసుంటే వన్డేల్లో అత్యధికంగా 49 సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసేవాడు. కానీ కాలం కలిసిరాకపోవడంతో వంద పరుగులకు చేరువైన సమయంలో పెవిలియన్ బాట పట్టాడు. అయినా తన అద్భుత ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను భారత్ మట్టికరిపించడంలో కింగ్‌ కోహ్లీ కీ రోల్ ప్లే చేశాడు. తన అద్భుత ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ కేవలం టీమిండియాకే కాదు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు చెప్పలేనంత హెల్ప్ చేశాడు. జియో సినిమా కారణంగా తగ్గిన వ్యూయర్షిప్ను తిరిగి పొండడమే కాక సరికొత్త రికార్డులు సృష్టించేందుకు కారణమయ్యాడు.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గ్లోబల్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్ రికార్డును బ్రేక్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన ఈ మ్యాచ్ ను దాదాపు 43 మిలియన్ల మంది చూశారు. గతవారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 35 మిలియన్ల మంది చూడగా.. ఆ రికార్డును డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తానే బద్దలుకొట్టింది. ఇప్పటివరకు జరిగిన క్రికెట్ మ్యాచ్లలో ఓ మ్యాచ్కు ఇంత భారీగా డిజిటల్ వ్యూయర్షిప్ దక్కడం ఇదే తొలిసారి.

ఐపీఎల్, ఇతర మ్యాచ్లను జియో సినిమా ఫ్రీగా స్ట్రీమ్ చేస్తూ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో వ్యూయర్షిప్ రికార్డులు బద్దలు కావడం డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు శుభపరిణామమనే చెప్పాలి. క్రికెట్ స్ట్రీమింగ్ లేని కారణంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో 12.5మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జూన్ చివరి నాటికి ఈ యాప్కు 40.4 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉండగా గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 21 మిలియన్ తక్కువ కావడం గమనార్హం. ఈ క్రమంలో వ్యూవర్లను పెంచుకునేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులను స్మార్ట్ ఫోన్లలో చూసే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ వర్కౌట్ కావడంతో వ్యూయర్షిప్లో రికార్డుల మోత మోగిస్తోంది.




Tags:    

Similar News