Virat Kohli: అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. కోహ్లీకి మూడో ర్యాంకు

Byline :  Bharath
Update: 2023-11-23 03:33 GMT

ఏజ్ పెరుగుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ కోల్పోతుంటారు. క్రమంగా బ్యాటింగ్ పై పట్టు కోల్పోయి రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు భిన్నం. తనను ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి ఎగురుతాడు. అడ్డుకుందామనుకుంటే.. అగ్గిలా మారతాడు. సింహంలా గర్జించి ప్రత్యర్థిపై దాడిచేస్తాడు. అదే ఇప్పుడు నిజం అవుతుంది. బ్యాడ్ ఫామ్ కు బైబై చెప్పి, టీంలోకి తిరిగొచ్చిన విరాట్.. చెలరేగిపోతున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్, నిన్న జరిగిన వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసి జట్టులో తానెంత ముఖ్యమో రుజువు చేశారు. విమర్శించిన ప్రతీ ఒక్కరికి తన కం బ్యాక్ తో రిప్లై ఇచ్చాడు. వరల్డ్ కప్ కు ముందు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 15 లో ఉన్న కోహ్లీ.. తన భీకర బ్యాటింగ్ తో టాప్ 3లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌లో విరాట్‌‌ (791 పాయింట్లు) నాలుగు నుంచి మూడో ప్లేస్‌‌లోకి దూసుకొచ్చాడు.

నిన్నటి మెగా ఈవెంట్‌‌లో 765 రన్స్‌‌ చేయడం కోహ్లీ ర్యాంక్‌‌ మెరుగుపడటానికి బాగా దోహదం చేసింది. కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ 769 పాయింట్స్ తో నాలుగో ర్యాంక్‌‌లో ఉండగా, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ 826 పాయింట్స్ తో టాప్‌‌ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు. బాబర్‌‌ ఆజమ్‌‌ 824 పాయింట్స్ తో రెండో ర్యాంక్‌‌లో ఉన్నాడు. బౌలింగ్‌‌లో హైదరాబాద్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ 699 పాయింట్స్ తో ఒక ప్లేస్‌‌ దిగజారి మూడో ర్యాంక్‌‌లో నిలిచాడు. బుమ్రా 685 పాయింట్స్ తో నాలుగో ర్యాంక్‌‌, స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ 667 పాయింట్స్ తో ఏడో స్థానం, మహ్మద్‌‌ షమీ 648 పాయింట్స్ తో పదో ర్యాంక్‌‌లో ఉన్నారు.




Tags:    

Similar News