Virat Kohli : విరాట్ కోహ్లీ ఇంకో 35 పరుగులు చేస్తే చాలు.. తొలి ఇండియన్గా రికార్డ్

Byline :  Bharath
Update: 2024-01-14 09:35 GMT

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 14 నెలల తర్వాత టీ20 ఫార్మట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో రికార్డుల రారాజు మరో అరుదైన రికార్డ్ పై కన్నేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 35 పరుగులు చేస్తే చాలు.. టీ20ల్లో 12,000 పరుగులు మార్క్ అందుకుంటాడు. దాంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. పొట్టి ఫార్మట్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్ (14, 562) పేరిట ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ మాజీ ప్లేయర్ షోయబ్‌ మాలిక్‌ (12,993), విండీస్‌ మాజీ కెప్టెన్ కీరన్‌ పోలార్డ్‌ (12,430) ఉన్నారు. వీరి సరసన విరాట్ కోహ్లీ నిలవనున్నాడు.




 


కోహ్లీకి అచ్చొచ్చిన ఆఫ్ఘనిస్తాన్ పై ఈ ఫీట్ ను అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆఫ్ఘన్ అంటే చెలరేగిపోయే విరాట్.. ఆసియా కప్ లో తన కంబ్యాక్, సుధీర్ఘ టీ20 సెంచరీని నమోదుచేసుకున్నాడు. టీ20ల్లో కోహ్లీకి అదే మొదటి సెంచరీ. అంతేకాకుండా దాదాపు మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి రాణించి జట్టులో తన ఎంపిక సరైనదేనని మరోసారి నిరూపించుకునే అవకాశం ఉంది.




Tags:    

Similar News