తిరిగి రానున్న విరాట్ కోహ్లీ..! సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ

Byline :  Bharath
Update: 2024-02-13 15:11 GMT

సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలక ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలవల్ల మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లీ.. తర్వాత మిగతా మ్యాచులకు కూడా దూరం అయ్యాడు. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ మొదలైంది. ఈ క్రమంలో కొన్ని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీకి ఆరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రెండోసారి ప్రెగ్నెంట్ అయిన అనుష్క శర్మ పరిస్థితి బాగోలేదని అందుకు కోహ్లీ అర్జెంట్ వెళ్లాల్సి వచ్చిందని మరోవార్త వైరల్ అవుతుంది. ఈ పుకార్లపై ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో చర్చనీయాంశం అయింది.

కాగా తన తల్లి సరోజ్ ఆరోగ్యంపై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. తన తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉంది. తనకేం కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పాడు. ఈ క్రమంలో డెవిలియర్స్ ఓ ఇంటర్వ్యూలో అనుష్క ప్రెగ్నెంట్ అని చెప్పాడు. అయితే ఏమైదో ఏమో.. మాట మార్చి తాను తప్పుడు సమాచారం చేశానని కోహ్లీ దంపతులకు క్షమాపణలు ఇచ్చాడు. ఈ క్రమంలో మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. డెవిలియర్స్ చెప్పింది నిజమేనని, ప్రెగ్నెన్సీ సమస్యల కారణంగా విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు కోహ్లీ దంపతులు వెళ్లారని అంటున్నారు. ఈ వార్తల్లో ఏది నిజమో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం కోహ్లీ.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. చివరి టెస్టు మ్యాచుకల్లా.. తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలపడం విశేషం. దీంతో అభిమానులకు కాస్త ఊరట లభించింది. ఇదిలా ఉండగా.. గాయల బారినపడ్డ టీమిండియాకు కీలక ఆటగాళ్లు దూరం అయ్యారు. వారి స్థానంలో కుర్రాళ్లు బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News