IND vs AFG 1st T20: తొలి టీ20కి కోహ్లీ దూరం.. రషిద్ ఖాన్ కూడా.. కారణం ఏంటంటే?

Byline :  Bharath
Update: 2024-01-10 12:51 GMT

ఆఫ్ఘనిస్తాన్ తో మొహాలీ గడ్డపై జరిగే మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. 14 నెలల పాటు టీ20 ఫార్మట్ కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. రేపటి మ్యాచ్ కు దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ మొదటి మ్యాచ్ ఆడట్లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని అన్నాడు. శుభ్ మన్ గిల్ మూడో వికెట్ లో బరిలోకి దిగనున్నాడు. కాగా ఇషాన్ కిషన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో సెలక్ట్ చేయలేదంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని ద్రవిడ్ కొట్టిపారేశాడు. ఇషాన్ కిషన్ తానే స్వయంగా విశ్రాంతి కోరినట్లు తెలిపాడు. టీమిండియాలో బ్యాటర్లు ఎక్కువగా ఉన్న కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టులో లేడని చెప్పాడు.

ఆఫ్ఘాన్ కు కూడా భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా రషిద్ ఖాన్ కూడా జట్టుకు దూరం అయినట్లు కెప్టెన్ ఇబ్రహిమ్ జాద్ర చెప్పాడు. ఇటీవలే రషిద్ ఖాన్ కు బ్యాక్ సర్జరీ అయింది. ఆ గాయం నుంచి ఇంక పూర్తిగా కోలుకోలేదు. ఆ కారణంగా భారత్ తో జరగబోయే టీ20 సిరీస్ కు దూరం అయినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత జరగబోయే సిరీస్ లకు రషిద్ అందుబాటులో ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు.




Tags:    

Similar News