IND vs PAK: సచిన్ రికార్డ్ బ్రేక్కు ఇంకా రెండు సెంచరీలే!

By :  Bharath
Update: 2023-09-11 13:04 GMT

ఆసియా కప్ లో భాగంగా కొలంబో వేదికపై జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో.. పాకిస్తాన్ బ్యాటర్లపై భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కొనసాగించారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన విరాట్.. రిజర్వ్ డేల్ గేరు మార్చాడు. పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో వన్డేల్లో విరాట్ 47వ సెంచరీ సాధించాడు. కొలంబోలో కోహ్లీ ట్రాక్ రికార్డ్ ను కొనసాగించాడు. ఇక్కడ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో సెంచరీ సాధించాడు. విరాట్ బ్యాట్ నుంచి 128*(119 బంతుల్లో), 131(96 బంతుల్లో), 110*(116 బంతుల్లో), 122* (ఇవాళ..94 బంతుల్లో) పరుగులు చేశాడు.

ఈ సెంచరీతో విరాట్ తన అంతర్జాతీయ వన్డేల్లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలు రాయిని అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. దానితో పాటు సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి విరాట్ కు ఇంకా 2 సెంచరీలే బాకీ ఉన్నాయి. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా ప్రస్తుతం కోహ్లీ 47 పరుగులు సాధించాడు.

Tags:    

Similar News