విరాట్‌ని ఇమిటేట్ చేసిన ఇషాన్... స్టేడియంలో నవ్వులు

Byline :  Veerendra Prasad
Update: 2023-09-18 06:58 GMT

ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను టీమ్‌ఇండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. వార్ వన్‌సైడ్ చేస్తూ.. ప్రత్యర్థిపై అన్ని రకాలుగా పైచేయి సాధించింది భారత జట్టు. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టులో ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. అవార్డుల ప్రెజంటేషన్‌ సమయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌ మధ్య సరదా సంఘటనలు అభిమానులను మరింత ఖుషీ చేశాయి. తొలుత విరాట్ కోహ్లీ ఎలా నడుస్తాడని ఇషాన్‌ కిషన్‌ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా నడిచి చూపించాడు.




 


‘ఏ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్? నేను అలా అస్సలు నడవను’ అన్నట్టుగా విరాట్ కోహ్లీ కూడా ఇషాన్ కిషన్‌ని ఇమిటేట్ చేస్తూ నవ్వించాడు. ఈ ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్‌ని అక్కడే నిల్చున్న తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్,శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా అండ్ కో చూస్తూ నవ్వుకున్నారు. ఈ దృశ్యాలన్నింటినీ స్టేడియంలో ఉన్న కొందరు ఫ్యాన్స్, తమ మొబైల్ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




Tags:    

Similar News