తొలి టెస్ట్.. టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్ బౌలింగ్..

Update: 2023-07-12 15:30 GMT

వెస్టిండీస్‌ - టీమిండియా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మొదట విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డొమినికాలోని రోసోలో గల విండ్సర్‌ పార్కులో ఈ టెస్ట్ జరుగుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ను ఇదే టెస్టుతో ప్రారంభించనుంది. టీమిండియా తరఫున ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైశ్వాల్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌కు మొండిచెయి ఎదురైంది.

కాగా టీమిండియాపై విండీస్‌ గెలిచి ఇప్పటికే రెండు దశాబ్దాలు దాటిపోయింది. సొంతగడ్డపై 2002లో చివరిగా భారత జట్టుపై విజయం సాధించి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకంది కరేబియన్‌ జట్టు. ఆ తర్వాత నుంచి భారత్ వెస్టిండీస్‌పై విజయయాత్ర కొనసాగిస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన ఈ సీరీస్ ను తమ సత్తా చాటాలని ధృడ నిశ్చయంతో ఉంది. ఇక విండీస్‌ ఈ సిరీస్ గెలిచిన తనపై ఉన్న అపవాదును చెరిపేసుకుంటుందా లేక టీమిండియా చేతిలో మరోసారి చిత్తవుతుందా అన్నది వెయిట్ అండ్ సీ.

టీమిండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్‌, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్‌:

క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), తగెనరైన్ చంద్రపాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్‌, అలీక్ అథనేజ్, జాషువా డా సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, రకీమ్ కార్న్‌వాల్‌, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.


Tags:    

Similar News