Shamar Joseph : పాతికేళ్ల కుర్రాడు.. బుల్లెట్ బంతులతో సొంతగడ్డపై ఆసీస్ను వణికించాడు.. ఎవరీ షమర్ జోసెఫ్?

Update: 2024-01-29 02:37 GMT

పాతికేళ్ల కుర్రాడు.. సొంతగడ్డపై ఆసీస్ నడ్డి విరిచాడు. బుల్లెట్ బంతులతో బెంబేలెత్తించాడు. తన కెరీర్ ను తొలి బంతితోనే అద్భుతంగా మొదలుపెట్టాడు. దుర్భేద్యమైన ఆసీస్ జట్టును, తన కంచుకోటైన గబ్బలో గజగజ వణికించాడు. తన పదునైన పేస్ బౌలింగ్ తో ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించాడు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినా పుంజుకుని.. రెండో మ్యాచ్ లో ఏకంగా 8 కీలక వికెట్లు పడగొట్టి సిరీస్ డ్రా చేయడమే కాకుండా.. చారిత్రక విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. ఫుట్ బాల్ ప్లేయర్ గా కెరీర్ ను మొదలుపెట్టి, మూడు నెలల ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నెట్ బౌలర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ఏకంగా ఆసీస్ ను చిత్తు చేశాడు. అతనే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్.




 


ఎవరీ షమర్ జోసెఫ్:

ఆగస్ట్ 31, 1999లో పుట్టిన షమర్ జోసెఫ్ కు.. చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఆర్థిక కష్టాలు కుటుం భారాన్ని మోసేలా చేశాయి. అయితే ఎక్కడా కుంగిపోలేదు. తన లక్ష్యాన్ని విడువలేదు. సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూనే.. కుటుంబానికి అండగా నిలబడ్డాడు. టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ.. క్రికెట్ లో అంచలంచెలుగా ఎదిగాడు. వెస్టిండీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టి సత్తాచాటాడు. ఏడాది తిరగకముందే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు నెలల ముందు జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నెట్ బౌలర్ గా ఉన్న జోసెఫ్.. ఆ టైంలోనే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంకేముంది.. వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ తో జరుగుతున్న సిరీస్ లో అరంగేట్రం చేసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఏడాది క్రితం ఫట్ బాల్ క్లబ్ లో కూడా షమర్ జోసెఫ్ ఎంట్రీ ఇచ్చాడు.


 



ఓవల్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన జోసెఫ్.. తన కెరీర్ డ్రీమ్ డెబ్యూ చేశాడు. తొలి బంతేకే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డ్ ను తన పేరిట రాసుకున్నాడు. ఇక రెండో మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్ లో చెలరేగి 7 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 215 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఆసీస్ కుప్పకూలింది. దీంతో 27 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. విండీస్ యువ జట్టు చరిత్ర లిఖించింది.






 


Tags:    

Similar News