India vs England : ఇవాళ ఇంగ్లాండ్తో టీమిండియా ఢీ.. గెలిస్తే సెమీస్కే..

By :  Lenin
Update: 2023-10-29 02:15 GMT

వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో ఐదుకు ఐదు మ్యాచులు గెలిచి తమకు ఎదురులేదని చాటిచెప్తోంది. గత వారం న్యూజిలాండ్ను ఓడించిన భారత్.. ఇవాళ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచులోనూ గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, గిల్ మంచి ఫామ్లో ఉన్నారు. అటు బౌలింగ్లో బుమ్రా, షమీ, కుల్ దీప్, జడేజా సత్తా చాటుతున్నారు. ఈ మ్యాచులో గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్ ఫిక్స్ అయ్యే ఛాన్సుంది.

ఇక పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉన్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్తో గాడిన పడాలని భావిస్తోంది. ప్రపంచకప్ కు ముందు బట్లర్ సేన అన్నీ జట్లను భయపెట్టింది. కానీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో టోర్నీలో అట్టడుగున నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచులో కూడా ఓడిపోతే ఇంగ్లాండ్ సెమీస్ చేరడం అసాధ్యం. కాబట్టి టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ ఆ జట్టు తప్పక గెలవాల్సిందే.

భారత జట్టు ( అంచనా) : రోహిత్‌, శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌/సిరాజ్‌, బుమ్రా, షమి

ఇంగ్లాండ్ : డేవిడ్ మలన్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌, లివింగ్‌స్టన్‌, బ్రూక్‌/మొయిన్‌ అలీ, రషీద్‌, విల్లీ, వోక్స్‌, వుడ్‌/అట్కిన్సన్‌


Tags:    

Similar News