భారత రెజ్లర్లకు భారీ షాక్..WFI సభ్యత్వం రద్దు!

Update: 2023-08-24 09:45 GMT

ప్రపంచ వేదికపై భారత రెజ్లర్లకు భారీ షాక్ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెంబర్‎షిప్‎ను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు తాజాగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ అనౌన్స్ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎలక్షన్స్ నిర్వహణలో WFI విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ తాజా నిర్ణయంతో రెజ్లర్లు త్వరలో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేసే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది.

" మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్‌ఐ కాంట్రవర్సీలో చిక్కుకుంది. చరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో WFI ప్యానెల్‌ను భారత ఒలింపిక్ అసోసియేషన్ క్యాన్సెల్ చేసింది. అనంతరం WFI నిర్వహణను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది భారత ఒలింపిక్ అసోసియేషన్. ఆగస్టు 27న ఈ కొత్త కమిటీ ఏర్పాటైంది. అయితే అప్పటి నుంచి 45 రోజుల్లోగా WFI ప్యానెల్‌కు ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహించకుంటే గుర్తింపు రద్దు చేస్తామని ముందుగానే యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ హెచ్చరించింది. అయితే , కొన్ని కారణాలతో ఈ ఎలక్షన్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్‌ సంఘం.. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News