World cup 2023 : ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ స్పెషల్ ఈవెంట్స్

By :  Kiran
Update: 2023-11-18 12:49 GMT

ప్రపంచకప్ ఫైనల్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఫైనల్ రోజున జరిగే ఈవెంట్లకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్‌ విడుదల చేసింది. టాస్‌ వేసినప్పటి నుంచి విజేతలకు కప్ ఇచ్చేంత వరకు జరిగే కార్యక్రమాల లిస్టు ప్రకటించింది

టాస్ వేసిన అనంతరం మధ్యాహ్నం 1: 35 గంటల నుంచి 1:50 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని సూర్యకిరణ్ ఎయిర్‌బాటిక్ బృందం ఎయిర్‌ షో నిర్వహించనుంది. ఫస్ట్ ఇన్సింగ్స్‌ డ్రింక్స్‌ విరామంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, గేయ రచయిత ఆదిత్య గద్వీతో మ్యూజిక్ ప్రోగ్రాం ఉండనుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌ బ్రేక్లో ప్రీతమ్‌, జోనితా గాంధీ, తుషార్‌ జోషీ తదితరుల నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో ఇన్నింగ్స్‌ విరామ సమయంలో లేజర్, లైట్‌ షో ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News