క్రికెట్ వరల్డ్ కప్ టికెట్లు కావాలా? ఎలా దొరుకుతాయో తెలుసా...
ఈ సారి వరల్డ్ కప్ భారతదేశంలో జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్ లను నేరుగా పోడియంలో కూర్చుని చూడడం ఒక మంచి అనుభవం. దీని కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అక్టోబర్ లో మొదలవనున్న వరల్డ్ కప్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా....
క్రికెట్ ప్రపంచ కప్ 2023 టికెట్ల విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. టికెట్లు కావాలనుకునేవారు క్రికెట్ వరల్డ్ కప్. కామ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయగలుగుతారు. ఆగస్టు 25 నుంచి టికెట్లను అమ్ముతారు. టీమ్ ఇండియా మ్యాచ్ లకు సంబంధించి ఈ నెల 25, 30, 31...సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చును. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు మాత్రం సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుంది.
అక్టోబర్ 5 నుంచి నవరంబర్ 19వరకు వరల్డ్ కప్ జరగనుంది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ తో టోర్నీ ఆరంభం అవుతోంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. అక్టోబర్ 14న పాకిస్తాన్ తో మ్యాచ్ ఉంటుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మొత్తం 9 మ్యాచ్ లు ఆడనుంది.
ఆగస్ట్ 25 నుంచి భారత్ ఆడే మ్యాచ్ లు, ఇతర వార్మప్ మ్యాచ్ ల టికెట్లు అమ్ముతారు.
ఆగస్టు 30నుంచి భారత్ ఆడే రెండు వార్మప్ మ్యాచ్ ల టికెట్లు విక్రయిస్తారు.
ఆగస్టు 31నుంచి చెన్నై, ఢిల్లీ, పుణె మైదానాల్లో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్లు అమ్ముతారు.
సెప్టెంబర్ 1 నుంచి ధర్మశాల, లక్నో, ముంబయ్ స్టైడియాల్లో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
సెప్టెంబర్ 2 నుంచి బెంగళూరు, కోలకత్తా స్టేడియాల్లో భారత్ పాల్గొనే మ్యాచ్ ల టికెట్లను విక్రయిస్తారు.
సెప్టెంబర్ 3 నుంచి అహ్మదాబాద్ గ్రైండ్ లో ఆడే మ్యాచ్ లటికెట్లు అందుబాటులోకి వస్తాయి.
సెప్టెంబర్ 15 నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల టికెట్లు విక్రయిస్తారు.