WPL schedule: ఐపీఎల్కు ముందు మరో పొట్టి లీగ్.. డబ్ల్యూపీల్ తేదీలను ప్రకటించిన బీసీసీఐ

Byline :  Bharath
Update: 2024-01-23 10:27 GMT

ఐపీఎల్ కు ముందు మరో పొట్టి లీగ్ అభిమానులను అలరించనుంది. ఈ మేరకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. డబ్ల్యూపీఎల్ (విమెన్ ప్రీమియర్ లీగ్) రెండో ఎడిషన్ డేట్స్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు ఈ లీగ్ జరగనుంది. సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. కాగా రెండో సీజన్ మొత్తం మ్యాచ్ లు ఢిల్లీ, బెంగళూరు స్టేడియాల్లో జరగనున్నాయి. మార్చ్ 15న ఎలిమినేటర్.. మార్చ్ 17న ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ రెండు మ్యాచులు ఢిల్లీ వేదికపైనే జరుగుతాయి.

డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ లో మొత్తం 22 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 జట్లు తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన రెండు జట్లు ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి.





Tags:    

Similar News