వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి రోజు చేతులెత్తేసిన టీమిండియా బౌలర్లు.. రెండో రోజు పుంజుకున్నారు. మొదటి సెషన్ నుంచి రెచ్చి పోయి బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 రన్స్ కు ఆలౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ (4 వికెట్లు) సత్తా చాటాడు. షమీ (2 వికెట్లు), షార్దూల్ (2 వికెట్లు) కీలక వికెట్లు పడగొట్టి.. ఆసీస్ ను 500 పరుగుల మార్క్ ను దాటకుండా కట్టడి చేశారు. స్పిన్నర్ జడేజాకు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్.. టీమిండియా దూకుడును అడ్డుకున్నారు. ట్రావిస్ హెడ్(163, 174 బంతుల్లో), స్మిత్(121, 268 బంతుల్లో) సెంచరీలు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీళ్లకి తోడు.. అలెక్స్ క్యారీ(48, 69 బంతుల్లో), వార్నర్ (43, 60 బంతుల్లో) రన్స్ చేశారు.