WTC Final : భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా

Update: 2023-06-09 16:51 GMT

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. 175 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించన కంగారులు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతానికి 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది ఆసీస్. దీంతో ఇండియా ముందు ఇప్పటికి 263 పరుగుల లక్ష్యం ఉంది. క్రీజ్‌లో హెడ్(3), లబూషేన్(35) ఉన్నారు. అంతకు ముందు వార్నర్ ఒక పరుగుచేసి ఔటవ్వగా, ఖవాజా13, స్మిత్ 35 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్, ఉమేష్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసి ఔటవ్వగా, భారత్ 296 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ను రహానె(89), శార్దుల్ ఠాకూర్(51) ఆదుకున్నారు.


Tags:    

Similar News