RCBని అంతలా నమ్మా.. కానీ, చివరికి మోసం చేశారు: చాహల్

Update: 2023-07-16 05:54 GMT

ఐపీఎల లో మోస్ట్ డేంజరస్ స్పిన్ బౌలర్లలో ఒకడు యుజేంద్ర చాహల్. 2012లో ముంబై తరుపున అరంగేట్రం చేసిన చాహల్, 2014 నుంచి 2021 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. 2022 నుంచి రాజస్థాన్ కు తరుపున ఆడుతున్నారు. కానీ, రాహుల్ కెరీర్ ను మార్చింది ఆర్సీబీనే. చాహల్ కూడా ఆర్సీబికి ఎన్నో విజయాలను అందించాడు. బెంగళూరును హోం టీంగా చేసుకున్నాడు. కానీ, 2021 రిటెన్షన్ లో ఆర్సీబీ చాహల్ ను వదులుకుంది. దాంతో అతన్ని రాజస్థాన్ దక్కించుకుంది.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చాహల్.. ఆర్సీబీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. ఆర్సీబీ టీం తరుపున 8 ఏళ్లలో దాదాపు 140 మ్యాచులు ఆడినప్పటికీ.. వాళ్లతో ఎప్పుడూ సరైన కమ్యూనికేషన్ లేదన్నాడు. ‘నన్ను మొదట వదులుకుని.. తర్వాత రిటైన్ చేసుకుంటామన్నారు. మళ్లీ జట్టులో చోటు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వాటిని చూసి నాకు చాలా కోపం వచ్చింది. చివరికి నన్ను వదులుకుంది. ఏదూమైనా నా ఫేవరెట్ చిన్న స్వామి స్టేడియమే’ అని చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News