Hyundai Creta:అదిరిపోయే లుక్‌లో హ్యుందాయ్ క్రెటా న్యూ కారు.. రూ. 25000తో కారు మీ సొంతం

Byline :  saichand
Update: 2024-01-08 11:41 GMT

హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన నూతన బ్రాండ్ SUV క్రెటా డిజైన్ సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది. ఈ కారు స్టైలీష్ లుక్స్‌తో, లేటెస్ట్ ఫ్యూచర్‌తో వావ్ అనిపించేలా కనిపిస్తుంది. జనవరి 16న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. రూ.25,000 టోకెన్ ప్రైస్‌తో ఈ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పాత మోడల్స్ పోల్చితే క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ల చాలా వరకు అప్‌డేట్ చేశారు. క్వాడ్-బీమ్ LED హెడ్‌ ల్యాంప్‌లతో న్యూ పారా మెట్రిక్ బ్లాక్ క్రోమ్ గ్రిల్‌తో పాటుగా .. కొత్త LED హోరిజోన్ పొజిషనింగ్ ల్యాంప్స్.. LED DRLలతో లైట్ సెట్టింగ్‌ను పిట్ చేశారు. నిటారైన హుడ్ లేఅవుట్.. క్రెటా ఫేస్‌లిఫ్ట్ SUVకి కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్‌ని అందిస్తుంది. కారు వెనక భాగంలో కొత్త టెయిల్ గేట్‌తో పాటు, మొత్తం వెడల్పును కవర్ చేసే LED లైటింగ్ బార్ అందించారు. ఈ సెట్టింగ్ SUVకి న్యూ మోడల్ లుక్‌లో కనిపించేలా చేస్తాయి. వెనుకవైపు, స్ప్లిట్‌ టెయిల్-ల్యాంప్ సెటప్‌ను కనెక్ట్ చేసే LED లైట్ బార్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక వీల్స్‌ను న్యూ అల్లాయ్ సెట్టింగ్‌తో 17-అంగుళాలు వెడల్పుతో తయారు చేశారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. ఇక డాష్‌ను పూర్తిగా న్యూ లుక్‌తో.. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో.. డిజిటల్ క్లస్టర్‌ను కలిగి ఉంది. సీట్లు, డోర్,స్టీరింగ్,గేర్ కవర్‌ను లెథెరెట్ ఆర్మ్‌రెస్ట్ కవరింగ్‌ను రూపొందించారు. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ సీట్లు వెంటిలేటెడ్‌తో పాటు, పవర్ డ్రైవర్ సీట్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, కొత్త డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఎనిమిది స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఒక పనోరమిక్ సన్‌రూఫ్ అందిచారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 2024లో మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి -- 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ (115PS, 144Nm), 1.5-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్ (160PS,253Nm),1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్. నాలుగు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. 6-స్పీడ్ MT, IVT, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ ATలతో కారు వేగం పరిమితి అందించారు. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏడు ట్రిమ్‌లను కలిగి ఉంది -- E, EX, S, S(O), SX, SX Tech మరియు SX(O). SUV 28 విభిన్న ట్రిమ్, ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌లను కలిగి ఉంది.

Tags:    

Similar News