Chandrayaan-3: ఇస్రో లైవ్ను ఎంతమంది చూశారంటే..?

Update: 2023-08-23 13:42 GMT

చంద్రయాన్-3 సక్సెస్ కావాలని యావత్ భారత దేశం ఎదురుచూసింది. మన శాస్త్రవేత్తల శ్రమ ఫలించాలని, చరిత్రలో భారత్ పేరు నిలవాలని పూజలు, యాగాలు చేసింది. ప్రజలంతా గర్వించేలా మన చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధృవంపై చేరుకుంది. ఈ ఘట్టాన్ని ఇస్రో తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేయగా.. ప్రపంచం మొత్తం ఇస్రో లైవ్ టెలికాస్ట్ ను వీక్షించింది. అందరి కళ్లు ఇస్రో లైవ్ వైపే ఉన్నాయి. అణుక్షణం ఉత్కంఠల మధ్య సాగిన ఈ ప్రయాణాన్ని 80 లక్షల మందికి పైగా లైవ్ లో వీక్షించారు. కేవలం గట్టన్నరలోనే ఇస్రో యూట్యూబ్ ఛానల్ కు 1.56 మిలియన్ల మంది కొత్త సబ్ స్క్రైబర్లు వచ్చారు. ఇదే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డ్. సౌతాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఉన్న ప్రధాని మోదీ కూడా ఇస్రో యూట్యూబ్ ఛానల్ లోనే లైవ్ వీక్షించారు.

Tags:    

Similar News