Aditya-L1 : అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో భూమి, చంద్రుడు..

Byline :  Veerendra Prasad
Update: 2023-09-07 08:33 GMT

సూర్యూడికి సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత దృశ్యాన్ని క్లిక్ మనిపించింది. ఒకే ఫ్రేమ్ లో భూమి, చంద్రుడి ఫోటోలను తీసింది. టార్గెట్ దిశగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1 తాజాగా సెల్పీ తీసుకుంది. ఈ సెల్ఫీ ఆదిత్య ఎల్-1 కు ఉన్న విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (VELC), సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (SUIT) పరికాలను క్యాప్చర్ చేసింది. ఈ సెల్పీతో పాటు భూమి, చంద్రుడి కూడా క్లిక్ మనిపించింది. సెప్టెంబర్ 4వ తేదీన తీసిన ఈ ఫోటోలను ఇస్రో తాజాగా ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. ‘‘భూమి-సూర్యుడి మధ్యలోని లగ్రాంజ్‌ పాయింట్‌ (L1 point)కు ప్రయాణంలో ఆదిత్య-ఎల్‌ 1 వీక్షించిన దృశ్యాలివి’’ అని ఇస్రో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. కాగా సూర్యుడిపై పరిస్థితులను అధ్యయనం చేసేందుకు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ వద్దకు చేరుకునేందుకు సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ఆదిత్య తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.




 


ఆదిత్య-ఎల్‌ 1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (VELC).. సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయనుంది. ఇక SUIT.. ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ను పరిశీలించనుంది. సెప్టెంబరు 2న ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 282కి.మీ X 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 10నతెల్లవారుజాము 2.30 గంటలకు చేపట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన 16 రోజుల్లో మొత్తం ఐదు విన్యాసాలు పూర్తయిన తర్వాత.. సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య-ఎల్ ప్రయాణిస్తుంది. అనంతరం 110 రోజులకు నిర్దేశిత ప్రదేశానికి(సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు) చేరనుంది.




 





 





 


Tags:    

Similar News