ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌కు అంతా సిద్ధం - ఇస్రో ట్వీట్

Update: 2023-08-23 08:52 GMT

చంద్ర‌యాన్‌-3 ప్రయోగం తుది అంకానికి చేరింది. విక్రమ్ ల్యాండర్ సాయంత్రం చంద్రునిపై దిగనుంది. ఈ క్రమంలో ల్యాండింగ్ కు అంతా రెడీ అంటూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కోసం అంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత స్థలానికి చేరుకున్న వెంటనే ల్యాండింగ్ కోసం సంకేతాలు పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది.




 


ల్యాండ‌ర్ విక్ర‌మ్ సాయంత్రం 5.44 గంటల సమయంలో నిర్దేశిత క‌క్ష్య‌కు చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. ఆ త‌ర్వాత ఏఎల్ఎస్ క‌మాండ్ అందుతుంద‌ని, ఆ వెంటనే ల్యాండ‌ర్ మాడ్యూల్‌ యాక్టివేట్ చేయ‌నున్న‌ట్లు చెప్పింది. ల్యాండర్ మాడ్యూల్ యాక్టివేట్ అయిన వెంటనే ఇంజిన్లు ఆన్ అవుతాయి. ఈ ఇంజిన్లు విక్రమ్ను సురక్షితంగా చంద్రుడిపై దింపుతాయి. బెంగుళూరులోని మిష‌న్ ఆప‌రేష‌న్ కేంద్ర‌మైన మాక్స్ నుంచి లైవ్ ప్ర‌సారాలు సాయంత్రం 5. 20 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో ట్వీట్‌లో ప్రకటించింది.




Tags:    

Similar News