అమెజాన్ మరోసారి ఆఫర్ల బంపర్ బొనాంజా ఇస్తోంది. మరోసారి తన కస్టమర్ల కోసం సేల్ ను తీసుకువస్తోంది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ముందుగానే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఆగస్టు 5 నుంి 9 వరకు ఈ సేల్ ఉంటుంది.
ఈ సేల్ లో అమెజాన్ ప్రైమ కస్టమర్లుకు 12 గంట ముందుగానే ఆఫర్లను పొందవచ్చును. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రీడమ్ సేల్లో శాంసంగ్, వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ ఫోన్ల మీద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఫఓన్ల మీద 40శాతం వరకూ డిస్కౌంట్ లభించనుందని అమెజాన్ చెప్పింది. దీంతో పాటూ స్మార్ట్ వాచ్, టీవీలు, ల్యాప్ టాప్, వైర్ లెస్ ఇయర్ బడ్స్, ఇంకా ఇతర ఎలక్ట్రానికి పరికరాల మీద కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా ఎంత డి్కౌంట్, ఏఏ గాడ్జెట్స్ కు ఉన్నాయి లాంటి వివరాలు రివీల్ చేయలేదు.ఇంతకు ముందు ప్రైమ్ డే సేల్ లో ఆఫర్లు మిస్ అయినవాళ్ళు ఇప్పుడు ఉపయోగించుకోవచ్చని అమెజాన్ అంటోంది.