ఇ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ జులై 15 నుంచి జులై 19 వరకు బిగ్ సేవింగ్ డేస్ అనౌన్స్ చేయగా, జులై 15 నుంచి జులై 16 అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రటకటించింది. ఈ రెండు సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఇతర వస్తువులను వీలైనంత తక్కువ ధరకే పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఈ నెల 15-19వ తేదీల మధ్య ఆరు రోజులు నిర్వహించనున్నట్టు తెలిపింది.ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫర్నీచర్,ఎలక్ట్రానిక్ , ఫ్యాషన్ వస్తువులతో పాటు ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు ఉన్నాయి. కొన్ని వస్తువులపై 75 శాతం నుంచి 80 శాతం ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డిస్కౌంట్లతో పాటు పలు బ్యాంకుల కార్డులపై క్యాష్ బ్యాక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్లకు ఒకరోజు ముందు సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ వివరించింది.
ఐ-ఫోన్14పై భారీ డిస్కౌంట్
బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐ-ఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తున్నది. ఐఫోన్-14 విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.79,900 కాగా ఈ సేల్‌లో రూ.70,999లకే పొందవచ్చు. ఐ-ఫోన్14 తోపాటు ఐఫోన్-13 ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరపై లభిస్తాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 15 నుంచి జులై 16 వరకు ప్రకటించింది. ఈ రెండు రోజులు అనేక కేటగిరీల్లోని వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఆపిల్ ఐఫోన్లపై ప్రైమ్ డే సేల్ గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, ఫ్యాషన్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికి ఐతే ఇది అద్భుతమైన అవకాశం. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 14 కేవలం రూ.66,499కే లభించనుంది.
శాంసంగ్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ కేవలం రూ.16.999, గెలాక్సీ 5జీ రూ.12,490 ధరకే లభించనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23పై రూ.6000, గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా ఫోన్లపై రూ.7000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు రూ.8000 వరకు అదనపు డిస్కౌంట్ బోనస్ ఉంటుంది. శాంసంగ్ తో పాటు వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ, మోటరోలా, ఐకూ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
ప్రైమ్ డే సేల్ 2023లో, ICICI బ్యాంక్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, EMI లావాదేవీలను ఉపయోగించి చెల్లింపులపై 10 శాతం తగ్గింపు ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసిన కొనుగోళ్లపై వినియోగదారులందరికీ 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.