యూజర్లందరికీ డబ్బులిస్తున్న ఫేస్‌బుక్.. చేసిన పాపానికి..

Update: 2023-07-27 10:47 GMT

యూజర్ల డేటాను అమ్ముకుతిన్న ఫేస్‌బుక్ పాపపరిహారం చెల్లించుకుంటోంది. అమెరికాలోని తన యూజర్లకు 72.5 కోట్ల డాలర్ల (రూ. 5940 కోట్లు) పరిహారాన్ని చెల్లిస్తామని తెలిపింది. మే 24, 2002 నుంచి డిసెంబర్ 22, 2022 మధ్య అకౌంటు తెరిచినవారికే డబ్బులివ్వనుంది. అమెరికాకు చెందిన ప్రతి యూజర్‌ కూడా పరిహారానికి అర్హులే. అయితే ఒక్కొక్కరికి ఎంత సొమ్ము వస్తుందో స్పష్టంగా తెలియడం లేదు. యూజర్లు ఈ ఏడాది ఆగస్టు 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి. యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తూ వాడి డేటాను అమ్ముకున్న కేసులో ఫేస్‌బుక్ మాతృసంస్థకు అమెరికా కోర్టు అక్షింతలు వేయడం తెలిసిందేవ. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేమ్ బ్రిడ్జ్ అనలైటికా సంస్థ.. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కొనుక్కుంది. ఆ డేటాను ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. యూజర్ల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి సొమ్ము పంపిణీ చేస్తారు.

ఫేస్‌బుక్ తన తప్పులకు పరిహారం ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మెటాకు చాలాసార్లు జరిమానాలు పడ్డాయి. ఈ ఏడాది మేలో యూరోపియన్ డేటా నిబంధనలను తుంగలో తొక్కిన కేసులో 130 కోట్ల డాలర్ల జరిమానా పడింది. ఐర్లాండ్ డేటా ప్రొటెకషన్ కమిషన్ ఈ జరిమానా విధించింది.


Tags:    

Similar News