‘ఐఫోన్ 15’ కొత్త మోడళ్లను మార్కెట్లోకి వదిలిన యాపిల్.. ఫీచర్లు, ధరలు..
స్టైలిష్ ఫోన్ల కంపెనీ యాపిల్ మార్కెట్లో సందడి చేసింది. ఐఫోన్ 15 మోడల్ ఫోన్లతోపాటు పలు యాక్సెసరీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘వండర్‌లస్ట్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ‘ఐఫోన్ 15’ మోడళ్లను, వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో కొన్నింటిని రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 48 మెగాపిక్సల్ కెమెరా, 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్ ఉన్నాయి. కామర్స్ సైట్లలో డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి ప్రీబుకింగ్ మొదలవుతుంది. మన దేశంలోని పన్నులను బట్టి ధరల్లో తేడాలు ఉండొచ్చు. సెప్టెంబర్ 22 నుంచి విక్రయాలు ఉంటాయి. కొత్త మోడళ్ల గురించి తెలుసుకుందాం.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్
ఐఫోన్ 15 సైజ్ 6.1 అంగుళాలు, 128 జీబీ రూ. 79,900, 256 జీబీ రూ. Rs 89,900, 512 జీబీ రూ. 1,09,900
ఐఫోన్ 15 ప్లస్ సైజ్ 6.7 అంగుళాలు, 128 జీబీ రూ. 89,900, 256జీబీ రూ. 99,900, 512 జీబీ రూ.1,19,900
ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్
గులాబీ, పసుపు, ఆకుపచ్చ నీలం, నలుపు రంగుల్లో లభ్యం
48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా. చార్జర్ టైప్-సి ఛార్జర్.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 15 ప్రో సైజ్ 6.1 అంగుళాలు
ఐఫోన్ ప్రో మ్యాక్స్ సైజ్ 6.7 అంగుళాలు
టైటానియమ్ డిజైన్, సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఏ17 ప్రో చిప్
ఐఫోన్ 15 ప్రో 128 జీబీ రూ. 1,34,900, రూ. 256 జీబీ రూ. 1,44,900, రూ. 512 జీబీ రూ. 1,64,900, 1టీబీ రూ. 1,84,900
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ. 256 జీబీ రూ. 1,59,900, 512 జీబీ రూ. 1,79,900, 1టీబీ రూ. 1,99,900
వాచ్ సిరీస్ 9
గత సిరీస్ కంటే వేగంగా పనిచేసే ఎస్9 చిప్ దీని ప్రత్యేకత
ధర 399 డాలర్లు (రూ. 33000)
మెషీన్ కంప్యూటేషన్లలో రెండు రెట్ల వేగం
ఐఫోన్లను ట్రేస్ చేసే ఫీచర్
డబుల్ ట్యాప్‌తో ఫోన్ కాల్ రిసీవ్ సదుపాయం
అల్ట్రా 2
జీపీఎస్ ప్లస్ సెల్యులర్‌తో కూడిన ఈ వాచీ ప్రారంభ ధర 799 డాలర్లు (రూ. 66,250)
ఎస్9 చిప్‌సెట్, డబుల్‌ట్యాప్ ఐఫోన్ ట్రేస్
లోపవర్ మోడ్‌లో 72 గంటల బ్యాటరీ చార్జింగ్