వచ్చే నెలలో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. ఇంకా స్మార్ట్ వాచెస్ కూడా..!!

Byline :  Veerendra Prasad
Update: 2023-08-30 02:10 GMT

కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్... తన ప్రొడక్ట్ iPhone 15 సిరీస్‌ను వచ్చే నెల సెప్టెంబర్ 12 న 'వండర్‌లస్ట్' ఈవెంట్‌‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 15 సిరీస్ తో పాటు, యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2, ఐఓఎస్ 17 మరియు వాచ్‌ ఓఎస్ 10 లాంచ్ డేట్‌తో పాటు పలు ఉత్పత్తులను ఈ ఫాల్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఆపిల్ ఈవెంట్‌లో లాంచ్ చేసే ఉత్పత్తులను కంపెనీ వెల్లడించలేదు.

సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. ఉదయం 10:00 గంటలకు (10:30 pm IST) ప్రారంభమయ్యే ఈవెంట్‌లో Apple తన iPhone 15 సిరీస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వార్షికోత్సవంలో ఆపిల్ సాధారణంగా కొత్త హార్డ్‌వేర్ ఉత్పత్తులను, ముఖ్యంగా కొత్త ఐఫోన్‌లు అలాగే ఆపిల్ వాచ్ మోడల్‌లను పరిచయం చేస్తుంది. ఎప్పటిలాగే, కొత్త ఐఫోన్‌లపై దృష్టి పెడుతుంది, ఈ ఏడాది కూడా రెండు iPhone 15 మోడల్‌లు మరియు రెండు హై-ఎండ్ iPhone 15 Pro వేరియంట్‌లతో సహా నాలుగు కొత్త మోడల్‌లు ఆవిష్కరించనుందని తెలిసింది.

వాటిలో అందరూ ఎంతో ఆతృత ఎదురుచూసేది మాత్రం iPhone 15 Pro Max మోడల్ కోసమే. రాబోయే iPhone 15, iPhone 15 Plus మోడల్స్ బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. USB-C ఛార్జింగ్‌ను పొందడానికి రెడీగా ఉన్నాయి ఈ మార్పుతో యూనివర్సల్ ఛార్జర్‌ని అందించనుంది. మీ డివైజ్ ఛార్జింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా, ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ వెర్షన్‌లు టైటానియం ఎడ్జ్‌లతో రానున్నాయి. ఐఫోన్ 15, 15 ప్లస్‌లు ప్రస్తుత మోడల్‌లకు సమానమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, ముఖ్యమైన కెమెరా, ఐఫోన్ 14 ప్రో లైన్ నుంచి A16 చిప్ అందించే అవకాశం ఉంది. ప్రో మోడల్‌లు వేగవంతమైన 3-నానోమీటర్ చిప్‌కి మారవచ్చు. ఆపిల్ బయోనిక్ A17 SoC ప్రాసెసర్ ఉండవచ్చు.



Tags:    

Similar News