Bajaj Platina 110 : మార్కెట్‌లోకి కొత్త బజాజ్‌ ప్లాటినా బైక్‌ .. ధర ఎంతంటే?

Byline :  saichand
Update: 2024-01-12 06:31 GMT

ప్రముఖ కాంపాక్ట్ కమ్యూటర్ బైక్ బజాజ్ న్యూ మోడల్ ప్లాటినా 110 మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మెరుగైన ఇంజన్‌తో, స్టైలీస్ లుక్‌తో ఈ మోడల్‌కు రూపొందించారు. ఇక బజాజ్ ప్లాటినా 110 మైలేజ్, ధర, ఫీచర్ల విషయానికి వస్తే..

బజాజ్ ప్లాటినా 110 ABS ఫీచర్లు

ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్): బజాజ్ ప్లాటినా 110 115.45 cc ఇంజన్‌తో ABS సాంకేతికతతో దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి బైక్. ఈ టెక్నాటజీతో బైక్‌ను సలభంగా వేగ నియంత్రణ చేయవచ్చు . బ్రేకులు వేసినప్పుడు, టైర్ స్ట్రక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ బైక్‌కు ముందు భాగంలో సింగిల్ ఛానల్ ABSతో 240 mm డిస్క్, వెనుకవైపు CBS టెక్నాలజీతో 110 mm డ్రమ్ బ్రేక్‌ను అందించారు.

ఇంజిన్: ఈ బైక్ 115.45 cc, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది మంచి మైలేజీని అందిస్తుంది. బైక్ ఇంజన్ DTS-i టెక్నాలజీతో నడుస్తుంది

సుపీరియర్ బ్యాలెన్స్: బజాజ్ ప్లాటినా 110 ABS తేలికపాటి బైక్, కేవలం 117 కిలోల బరువు ఉంటుంది., ఈజీగా బైక్‌ను నిమంత్రించవచ్చు.

స్మూత్ టెక్నాలజీ: బజాజ్ ప్లాటినా 110 ccలో ఉపయోగించిన స్మూత్ ఇంజన్ టెక్నాలజీ బైక్ సాఫీగా స్టార్ట్ చేయడంలో సహయసడుతుంది. ఎక్కువగా హిట్ కాకుండా సాఫీగా ప్రయాణించేలా కొత్త టెక్నాలజీని ఈ బైక్‌లో అందించారు. ప్లాటినా 110 ABS DRL లైట్లతో స్పష్టమైన విజిబిలిటీని ఇస్తుంది. రాత్రిపూట కూడా ఎక్కువ దూరం ప్రయాణించడంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు.

తక్కువ ధర, అధిక మైలేజీ: బజాజ్ ప్లాటినా 110 మైలేజీలో టాప్ బైక్ అని చెప్పవచ్చు. లీటర్ ప్రెటోల్‌కు 70పైగా మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ తక్కువ పెట్రోల్‌తోనే ఎక్కువ దూరం సులభంగా ప్రయాణించగలదు. రోజులో ఎక్కువ దూరం ప్రయాణించేవారికి బజాజ్ ప్లాటినా 110 ABS మంచి ఆప్షన్.

ఇతర ఫీచర్లు: బజాజ్ ప్లాటినా 110 డిజిటల్ స్పీడోమీటర్‌తో అమర్చబడి ఉంది, దీనిలో మీరు రైడింగ్ చేస్తున్నప్పుడు గేర్ ఇండికేటర్, ABS ఇండికేటర్ గేర్ గైడెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మెరుగైన ఇంజన్‌తో, స్టైలీస్ లుక్‌తో గత మోడల్‌కు రూపొందించారు. ఇక బజాజ్ ప్లాటినా 110 మైలేజ్, ధర, ఫీచర్ల విషయానికి వస్తే..

Tags:    

Similar News