ఆపిల్ ఫీచర్లతో బోట్ స్మార్ట్ వాచ్

Update: 2023-07-11 09:15 GMT

ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ లను ప్రవేశపెట్టింది. ఆపిల్ వాచ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్ ను బోట్ తీసుకువచ్చింది. బోట్ వేవ్ ఫ్యూరీ అని దీనికి పేరు పెట్టింది.

బోట్ స్మార్ట్ వాచ్ 240*284 ppi రిజల్యూషన్ , 550nits బ్రైట్ నెస్ తో ఉంటుంది. 1.83 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే ఇందులో ఉంటుంది. డ్యూయల్ లేయర్ మెటల్ కోటింగ్ కలిగి ఉండే ఈ వాచ్ స్ప్లాష్, చెమట, ధూళి నుంచి ప్రొటెక్షన్ కోసం IP67 రేటింగ్ ను కూడా కలిగి ఉంది. ఫంక్షనల్ క్రౌన్, హెల్త్, ఫిట్ నెస్ మానిటరింగ్ ఫీచర్స్ తో పాటూ హార్ట్ రేటింగ్ మానిటరింగ్, spO2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ లను కూడా చూపిస్తుంది. మన బాడీలో ముఖ్యంశాలను అన్నింటినీ ట్రాకింగ్ చేస్తుందీ స్మార్ట్ వాచ్ అన చెబుతోంది బోట్ కంపెనీ. ఫిట్ నెస్ ట్రాకింగ్ కోసం 50కి పైగా స్పోర్ట్స్ మోడ్ లు ఇందులో ఉన్నాయి.




 


బోట్ వేవ్ ఫ్యూరీ బ్లూటూత్ కాలింగ్ ను అందిస్తోంది. ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో 10 వరకు ఫోన్ నంబర్లను సేవ్ చేసుకోవచ్చును. ఆపిల్ వాచ్ లోలాగే ఒక డిజిటల్ క్రౌన్ కూడా ఇందులో ఉంటుంది. వాచ్ లో సెట్టింగ్స్ దీనితో చేసుకోవచ్చును. ఈ స్మార్ట్ వాచ్ ఇంటర్నల్ వర్చువల్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తోంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది. వన్ ఇయర్ వారంటీతో వేవ్ ప్యూరీ వాచ్ లభిస్తోంది. దీని ప్రారంభ ధర 1, 299 రూ. యాక్టివ్ బ్లాక్, మెటాలిక్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, టీల్ గ్రీన్ అనే ఐదు కలర్లలో దొరుకుతుంది.




 


Tags:    

Similar News