వచ్చే వారం నుంచి చాట్ జీపీటీలో కొత్త మార్పులు

Update: 2023-08-08 14:11 GMT

ఏఐ టెక్నాలజీ రోజురోజుకూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నా...దీన్ని వాడడం మాత్రం ఎవరూ మానడం లేదు. ఓపెన్ ఏఐ తాలూకా చాట్ జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను టెకీలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు తాజాగా నెక్స్ట్ వీక్ నుంచి చాట్ జీపీటీ మరో కొత్త ఫీచర్ తో రాబోతోంది.

లాస్ట్ మంత్ లో యూజర్ల కోసం బీటా కస్టమైజ్డ్ ఇన్ స్ట్రక్చర్ ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసింది చాట్ జీపీటీ. ఇప్పుడు డెవలపర్ రిలేషన్స్ ఎక్స్ పర్ట్, లోగాన్ కిల్ పాట్రిక్ లాంటి కొత్త అప్డేట్ లను తెస్తోంది. అంతేకాదు కలిప్ ట్రిప్ ద్వారా హైలేట్ చేయబడిన ఈ కొత్త ఫీచర్లలో స్రాంప్ట్ లు, ఎక్జాంపుల్ ప్రాంప్ట్స్, సజెస్ట్డ్ రిప్లై, ఫాలో అప్ క్వశ్చన్ లు ఉన్నాయి. ఈ మార్పులతో చాట్ జీపీటీ మరింత ఆకర్షణీయంగా మారనుంది. దీనికి తోడు చాట్ జీపీటీ ప్లస్ సబ్ స్క్రైబర్ లు ఇప్పుడు జీపీటీ-4 కోసం డీఫాల్ట్ సెట్టింగ్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఓపెన్ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను మాన్యువల్ గా టోగుల్ చేయవలసిన అవసరం ఉండదు.

ఇక ఓపెన్ ఏఐ కోడ్ ఇంటర్ ప్రెటర్ ప్లగిన్ ను ఉపయోగిస్తున్న చాట్ జీపీటీ ప్లస్ యూజర్ల కోసం మల్టిపుల్ ఫైల్స్ ను ఒకేసారి అ్లోడ్ చేసుకునే వెసులుబాటును తెస్తోంది. దీంతో ప్లగ్ ఇన్ విధానాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చును. ఈ ఫీచర్స్ తో చాట్ జీపీటీ చాలా బావుంటుందని అంటున్నారు యూజర్లు. వీటన్నిటితో పాటూ కొందరు హిస్టరీ సెర్చ్ కూడా ఉంటుందని బావుంటుందని అంటున్నారు. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ లో అందుబాటులో ఉందని అంటున్నారు.


Tags:    

Similar News