Chandrayaan-3 Success: చంద్రయాన్-3కి ఖర్చు ఎంత..? చంద్రయాన్- 2, 3 మధ్య ప్రధాన తేడాలేంటి..?

Update: 2023-08-23 15:01 GMT

2019లో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలం అయిందన్న విషయం తెలిసిందే. ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోవడంతో ఈ ప్రయోగం విఫలం అయిందని అప్పటి ఇస్రో ఛైర్మన్ శివర్ ప్రకటించారు. ఆ ఫెయిల్యూర్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్న ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని మొదలుపెట్టింది. చంద్రయాన్ -2 కన్నా ఉత్తమంగా చంద్రయాన్-3ని రూపొదించారు. ఈసారి ఎలాగైనా విజయ సాధించాలన్న ధీమాతో ప్రయోగం మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు ఇస్రో సైంటిస్ట్ లు. చంద్రయాన్-2లో కొన్ని కీలక మార్పులు చేసి.. జులై 14, 2023న ప్రయోగించారు. అవేంటంటే..

చంద్రయాన్-2:

ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లతో కలిపి.. చంద్రయాన్-2 రాకెట్ మొత్తం బరువు 3850 కిలోలు ఉంటుంది. అందులో ఆర్బిటర్ జీవిత కాలం ఏడాది. ల్యాండర్, రోవర్ లైఫ్ టైం ఒక లూనార్ డే ఉంటుంది. చంద్రయాన్-2 వాహకనౌక వ్యయం రూ.970 కోట్లు. GSLV MK III-M1తో కలిపి ప్రయోగానికి మరో రూ.367కోట్లు ఖర్చయ్యాయి. దీని ప్రయాణం 48 రోజులు. ల్యాండర్ లో 5 థ్రస్టర్స్ ఉంటాయి. చంద్రునిపై చంద్రయాన్-2 ల్యాండింగ్ కు 500M/500M ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

చంద్రయాన్-3:

ప్రొపల్సన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ లన్నీ కలిపి చంద్రయాన్-3 మొత్తం బరువు 3900 కిలోలు. ప్రొపల్షన్ మాడ్యూల్ లైఫ్ టైం 3 నుంచి 6 నెలలు ఉంటుంది. చంద్రయాన్- 3 ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే. చంద్రయాన్-3 వాహకనౌక వ్యయం రూ.615 కోట్లు. దీని ప్రయాణ సమయం 42 రోజులు. ల్యాండర్ లో 4 థ్రస్టర్స్ ఉంటాయి. ఈ ప్రయోగంలో మిషన్ ల్యాండింగ్ ఏరియాలో మార్పులు చేశారు. దీనికి చంద్రయాన్-2 కన్నా శక్తివంతమైన కాళ్లు ఉన్నాయి. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా రోవర్స్ డిజైన్ చేసి పంపించారు.

Tags:    

Similar News