Gaganyaan Postponed: టీవీ-1 వ్యోమనౌకలో మంటలు.. నిలిచిన ప్రయోగం

By :  Bharath
Update: 2023-10-21 04:03 GMT

గగన్ యాన్ మిషన్లో కీలకమైన తొలి దశ ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1) అకస్మాత్తుగా చివరి క్షణాల్లో ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా గగన్ యాన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. మరో ఐదు సెకన్లలో టీవీ-1 వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. రాకెట్లో కొద్దిపాటి మంటలు వచ్చాయి. అనంతరం రాకెట్ పరీక్ష నిలిచిపోయింది. ఇవాళ్టికి ఈ ప్రయోగాన్ని హోల్డ్ లో పెట్టామని, మళ్లీ ప్రయోగం చేపడతామని, ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రయోగంలో ఎక్కడ ఫెల్యూర్ జరిగిందో శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అన్నీ సరిచూసుకుని మరోసారి ప్రయోగించనున్నారు. కాగా గగన్ యాన్ ప్రయోగం శనివారం ఉదయం 8 గంటలకు జరగాల్సి ఉండగా.. అరగంటపాటు ఆలస్యం అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం 8 గంటలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 8.30కి చేపట్టారు.

గగన్ యాన్ వ్యోమనౌక ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత వ్యోమగాముల్ని తిరిగి భూమికి తీసుకొస్తారు. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. దీనిపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే మొదట టీవీ- డీ1 పరీక్షను నిర్వహిస్తుంది.


Tags:    

Similar News