ఉద్యోగులను ఇంటికి పంపి.. ఏఐను పెట్టుకున్న స్టార్టప్ సంస్థ

Update: 2023-07-11 16:13 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెల్లిగా అన్ని రంగాలకు పాకుతోంది. ఏఐతో లాభాలు పక్కనబెడితే.. ఉద్యోగుల భద్రతకు ముప్పు పొంచి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏఐతో పలువురు ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో ఓ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలోని 90శాతం ఉద్యోగుల్ని తొలగించి ఏఐతో రిప్లేస్ చేసింది.

ప్రముఖ ఈ-కామర్స్ స్టార్టప్ దుకాణ్ భారీగా ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీమ్‌లోని 90 శాతం మంది ఉద్యోగుల స్థానంలో ఏఐ చాట్‌బాట్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుమిత్ షా తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు అవసరమైన సహాయం అందించినట్టు స్పష్టం చేశారు.

‘‘మా సంస్థలో 90 శాతం కస్టమర్‌ సపోర్ట్ టీమ్‌ను ఏఐతో భర్తీ చేశాం. ఈ నిర్ణయం కష్టమైందే అయినా తప్పడంలేదు. సంస్థ లాభాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల కస్టమర్‌కేర్‌ నిర్వహణ కోసం కంపెనీ ఖర్చు చేసే మొత్తం 85 శాతం తగ్గింది. అదేవిధంగా కస్టమర్ సేవలను అందించే సమయం 2 గంటల నుంచి 3 నిమిషాలకు తగ్గింది’’ అని సుమిత్ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మీకు అసలు జాలి దయ లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News