ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డీల్.. అస్సలు మిస్ కావొద్దు

Byline :  Bharath
Update: 2023-12-08 10:43 GMT

ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్ల కోసం మరో భారీ డీల్ ను తీసుకొచ్చింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు ఏడు రోజుల పాటు కొనసాగే ఈ డీల్ లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ లభించనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు ముందుగానే అంటే డిసెంబర్ 8 నుంచే సేల్ ప్రారంభం కానుంది. కాగా కొన్ని మోస్ట్ సేల్డ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఉండనుంది.

ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్:

  • ఐఫోన్ 14 ధర రూ.69,900 ఉండగా.. డిస్కౌంట్తో రూ.55,000కే లభిస్తుంది.
  • మోటో ఎడ్జ్ 40 రూ.34,999 ఉండగా.. డిస్కౌంట్తో రూ.25,499కే లభిస్తుంది.
  • నథింగ్ ఫోన్2 రూ.39,999 ఉండగా.. డిస్కౌంట్తో రూ. 34,999కే లభిస్తుంది.
  • ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ డిస్కౌంట్తో రూ. 7,149కే లభిస్తుంది.

వీటితో పాటు.. గూగుల్‌ పిక్సెల్‌7, రియల్‌మీ సీ53, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ, పోకో సీ55, రియల్‌మీ 11 ప్రో 5జీ.. సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది ఫ్లిప్ కార్ట్. ఇక ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ గూడ్స్ పై 75 శాతం డిస్కౌంట్ అందించనుంది ఫ్లిప్ కార్ట్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల ద్వారా 10శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

Tags:    

Similar News