IPhone 16 : ఐఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త.. 5 మోడళ్ల ఫీచర్స్ ఇవే
ఐఫోన్ కొనాలనుకునేవారికి ఆపిల్ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతి ఏడాది మార్కెట్లోకి ఐఫోన్ సిరీస్‌లు వస్తూ ఉంటాయి. ఆ సిరీస్‌లు 4 మోడళ్లలో విడుదలవుతుంటాయి. అయితే ఈసారి అంతకుమించి విడుదల చేయనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లోకి ఐఫోన్16 సిరీస్ రానుంది. ఇది 5 మోడళ్లలో మార్కెట్లోకి విడుదల కానుందని తెలుస్తోంది. సాధారణంగా ఆపిల్ సంస్థ తమ కొత్త స్మార్ట్ ఫోన్లను సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తూ ఉంటుంది. అందులో స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ అనే నాలుగు మోడళ్లలో కొత్త ఐఫోన్లు విడుదల అవుతుంటాయి.
అయితే ఈసారి తాము విడుదల చేసే ఐఫోన్ 16 సిరీస్‌లో 5 మోడళ్లను విడుదల చేయాలని ఇప్పటికే ఆపిల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 వెర్షన్‌లో డ్యూయర్ రియర్ కెమెరా యూనిట్ ఉండగా ఐఫోన్ 16 ప్రోతో పాటుగా ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇకపోతే టెక్ నిపుణులు ఐఫోన్ 16 సిరీస్‌లో కొన్ని ఫీచర్లు ఉంటాయని అంచనా వేశారు. ఐఫోన్ 16 ఎస్ఈ 90 హెచ్‌జెడ్ స్క్రీన్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లేతో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ 6.7 అంగుళాల 60 హెచ్‌జెడ్ స్క్రీన్‌తో రావొచ్చని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో కూడా డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది.
ఇకపోతే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో వేరియంట్లు 120హెచ్‌జెడ్‌తో 6.3 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 120హెచ్‌జడ్‌తో 6.9 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే ఐఫోన్ 16 ఎస్ఈ 128జీబీ మోడల్ ధర రూ.58,000 నుంచి ప్రారంభం కావచ్చని, ఐఫోన్ 16 ఎస్ఈ ప్లస్ 256జీబీ ధర సుమారు రూ.66,000 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ 256జీబీ వెర్షన్‌లు వరుసగా రూ. 83,000, రూ. 91,000గా ఉండనున్నాయి.
It is being rumoured that Apple might decide to launch as many as 5 models this year in its upcoming iPhone 16 series. Tipster Majin Bu suggested on X (previously Twitter) that we could see two new iPhone 16 SE models too in 2024. Here are the details.#Techinformer pic.twitter.com/k1LG4gwZjE
— Tech Informer (@Tech_Informer_) February 16, 2024