‘గూగుల్ డ్రైవ్‌లో వేసుకుందాం.. ఫైల్ డ్రైవర్ లింకులో పంపండి’ అనే ముందు ఇక కాస్త ఆలోచించాలి. కొన్ని వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గూగుల్ డ్రైవర్ సేవలని నిలిపివేస్తున్నట్లు గూగుల్ కంపెనీ తెలిపింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించడానికి, సైబర్ భద్రతను పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
ఆగస్టు 2023 నుంచి విండోస్ 32-బిట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవారికి గూగుల్ డ్రైవ్ (Google Drive) సేవలు బంద్ కానున్నాయి. విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2012 యూజర్లకు సేవలే నిలిచిపోతాయి. విండోస్ 8 – 32 బిట్ వెర్షన్ వాడుతున్నవాళ్లు విండోస్ 10 - 64-బిట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. అయితే గూగుల్ బ్రౌజర్ ద్వారా యూజర్లు డ్రైవ్‌ను యాక్సెస్ చేసుకునే సదుపాయం ఇకముందూ ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, పుస్తకాలు సహా చాలా అవసరాల కోసం గూగుల్ డ్రైవ్ వాడుతుంటారు. డేటా పరిమితి సమస్య ఉన్నా సాధారణ యూజర్లుకు ఇది మంచి స్టోరేజీనే. 32 బిట్ వెర్షన్లలో కొన్ని అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్లు పనిచేయని నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.