మన ఫోన్లలో ఇక భూకంప అలర్ట్.. గూగుల్ కొత్త ఫీచర్

Update: 2023-09-27 17:21 GMT

ఇటీవల దేశంలోని ప్రజల మొబైల్ ఫోన్లకు బీప్‌ప్‌ప్ అంటూ ఎమర్జెన్సీ మెసెజ్ అలర్ట్ రావడం, జనం భయపడిపోవడం తెలిసిందే. విపత్తుల సమయంలో హెచ్చరించే మెసేజింగ్ అలర్ట్ వ్యవస్థను పరీక్షించడంలో భాగంగా ఆ మెసేజీలు పంపినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విపత్తులు వచ్చే ముందు ప్రజలను అలర్ట్ చేసే సాంకేతిక వ్యవస్థను తాము భారత్‌లో ఏర్పాటు చేసినట్లు గూగుల్ సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ భూకంపాలు వచ్చే ముందు ఆండ్రాయిడ్‌ ఫోన్ యూజర్లను అలర్ట్ చేస్తుంది.

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌లతో కలసి సందేశాలు పంపిస్తుంది. సందేశాలు ఇంగ్లిష్, హిందీలతోపు ఆయా ప్రాంతీయ భాషల్లోనూ వస్తాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న ఈ టెక్నాలజీని భారత్‌లోనూ ప్రవేశపెడుతున్నామని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్‌ 5 ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఇంటర్నెట్ ఉండాలి. ఫీచర్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలోని యాక్సెలరోమీటర్‌ మినీ సిస్మోమీటరుగా పనిచేస్తుంది. భూప్రకంపనలను పసిగడుతుంది. నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లు ప్రకంపనలకకు స్పందిస్తే గూగుల్ సర్వర్‌ వాటిని సేకరించి నిజంగా భూకంపం వచ్చిందా లేదా అని పరిశీలిస్తుది. భూకంప తీవ్రతను, భూకంప కేంద్రాన్ని అంచనా వేశాక యూజర్లకు అల్టర్ మెసేజీలు వెళ్తాయి. తీవ్రతను బట్టి Be Aware and Take Action, Be Aware అనే రెండు రకాల మెసేజీలు వస్తాయి.


Tags:    

Similar News