ఇప్పుడంతా డిజిటల్ మయమే. ఎక్కడ చూసిన డిజిటల్ పేమెంట్సే.. కూరగాయల దగర్నుంచీ షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి డిజిటల్ పేమెంట్సే. దేశంలో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాష్ వాడకం తగ్గిపోయింది. యూపీఐ సేవల్లో కూడా కొత్త కొత్త అప్డేట్లు వస్తున్నాయి. యూపీఐ సేవలను ప్రారంభించిన ఎన్పీసీఐ ఇప్పుడు యూపీఐ లైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ఇప్పటికే ఫోన్ పే, పేటీఎం యాప్స్లో అందుబాటులోకి వచ్చింది.
తాజాగా గూగుల్ పే తమ యూజర్ల కోసం యూపీఐ లైట్ ఆప్షన్ తీసుకొచ్చింది. సాధారణంగా పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. కానీ ఈ యూపీఐ లైట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్ ద్వారా పిన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ఆ తర్వాత వ్యాలెట్‌లో కొంత మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిన్, బ్యాక్తో సంబంధం లేకుండానే పేమెంట్ చేయొచ్చు.
200 రూపాయల వరకు లావాదేవీలకు ఎలాంటి పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ లైట్ వ్యాలెట్‌లోకి గరిష్ఠంగా రూ.2 వేల వరకు మొత్తాన్ని లోడ్ చేసుకోవచ్చు. పీక్ అవర్స్‌లోనూ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని గూగుల్ పే హామీ ఇస్తోంది. యూపీఐ లైట్ లావాదేవీ వల్ల బ్యాంక్ పాస్ బుక్‌లోనూ చిన్న చిన్న లావాదేవీలు నమోదుకాకుండా ఉంటాయి. ప్రస్తుతం 15 బ్యాంకులు యూపీఐ లైట్‌కు సపోర్ట్ చేస్తున్నాయి.