రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ

By :  Kiran
Update: 2023-12-30 09:16 GMT

రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళి సై స్పందించారు. బోయిన్‌పల్లిలోని అయోధ్య రామాలయ ద్వారాలు తలుపులు, తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు. తనను పదవి నుంచి తప్పించాలని ఢిల్లీకి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని తమిళిసై స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానని తేల్చిచెప్పారు.

‘‘నేను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గానే ఉంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా. ఢిల్లీ వెళ్లి ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదు. వరద ప్రభావానికి గురైన తమిళనాడులోని తూత్తుకుడి వెళ్లి చూసి వచ్చాను. అంతేతప్ప ఏ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు." అని తమిళిసై స్పష్టం చేశారు.

రామ మందిర్‌లో నిర్మాణంలో అనురాధ టింబర్స్ ఒక గొప్ప పాత్ర పోషించడం ఎంతో గర్వకారణంగా ఉందని . గవర్నర్ గా తాను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అవసరమనుకుంటే వాళ్లనే పిలిపించుకోవచ్చని... కానీ తానే స్వయంగా ఆ అద్భుతాలను చూడాలని వచ్చినట్లు చెప్పారు. తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా ఫాలో అవుతానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు.


Tags:    

Similar News