Hero Marvic 440 Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా సరికొత్త బైక్..లుక్ అదుర్స్

Byline :  Vinitha
Update: 2024-02-18 07:36 GMT

(Hero Marvic 440 bike) రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మార్కెట్లోకి మరో కొత్త బైక్ వచ్చింది. హీరో మార్విక్ 440 పేరుతో ఈ బైక్ సూపర్ స్పోర్టీ లుక్‌లో అదిరిపోతోంది. ఈ బైక్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షోరూం అయితే రూ.1.99 లక్షలుగా ఉంది.




 


హీరో మార్విక్ 440 బైక్ మూడు వేరియంట్లలో లభించనుంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్ మనకు అందుబాటులో ఉన్నాయి.వాటి ధరలు చూస్తే బేస్ వేరియంట్ ధర రూ.1,99,000, మిడ్ స్పెక్ వేరియంట్ ధర రూ.2,14,000, టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ.1,24,000గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. హీరో మావెరిక్ 440 బైక్‌లో ఎల్ఈడీ లైట్ ఉంది. డిజిటల్ కన్సోల్ మీటర్ కూడా అమర్చారు. అంతేకాకుండా మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి చార్జింగ్ పోర్ట్ కూడా ఈ బైక్‌లో ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే బైక్ టాప్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.




 


హీరో కంపెనీ నుంచి వస్తున్న ఈ క్రూయిజర్ బైక్ ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 42, హోండా హైనెస్ సీబీ350, యెజ్డీ రోడ్‌స్టర్ వంటి బైక్‌లతో పోటీపడనుంది. ఈ బైక్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 2024 మార్చి 15వ తేది వరకూ 'వెల్‌కమ్ టు ది మావెరిక్ క్లబ్' అనే పేరుతో ఆఫర్లను కూడా హీరో కంపెనీ అందిస్తోంది.  


Tags:    

Similar News