జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే ఆ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 కాలు మోపనుంది. లక్ష్యం దిశగా పైయనించిన చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగనుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఆ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సన్నద్ధమైంది. 41 రోజుల ప్రయాణం అనంతరం జాబిల్లి ఉపరితలంపై అడుగువేసేందుకు విక్రమ్ ల్యాండర్ రెడీ అయ్యింది. మరి, చారిత్రాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ వెనకున్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ముఖ్యమైన వ్యక్తులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ఇస్రో ఛైర్మన్ -ఎస్ సోమ్‌నాథ్ భారతి :
చంద్రయాన్-3ని ఆకాశంలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్ మార్క్-3ని రూపొందించడంలో కీలక పాత్రను పోషించారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ భారతి.
ఈయప 2022 జనవరి నెలలో ఇస్రోకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్తోపాటుగా అతిత్వరలో ప్రారంభమయ్యే గగన్‌యాన్ మిషన్, సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 పనులను ఈయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్- పీ వీరముత్తువేల్ :
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పీ వీరముత్తువేల్ 2019లో బాధ్యతలు తీసుకున్నారు. న్యూ రోవర్, ల్యాండర్ రూపకల్పన ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఐఐటీ మద్రాసు నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్లో పీహెచ్‌డీ పట్టా అందుకు వీరముత్తువేల్ చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనితా ఆధ్వర్యంలోనూ పనిచేశారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, మంగళయాన్ మిషన్‌లో ఈయన కీలకమైన పాత్రను పోషించారు.
చంద్రయాన్-3 డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్- కె కల్పన :
చెన్నైలో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా బాధ్యతు చేపట్టారు కల్పన . అంతకు ముందు శ్రీహరికోటలో 5 ఏళ్లు పనిచేశారు. 2005లో ట్రాన్స్ఫర్ మీద బెంగళూరులోని శాటిలైట్ సెంటర్లో బాధ్యతలు నిర్వహించారు. కల్పన సుమారు ఐదు ఉపగ్రహాల తయారీలో భాగమయ్యారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులోనూ ఈమె పార్టిసిపేషన్ ఉంది. తాజాగా చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అసోసియేటెడ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్-ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ :
కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు ఉన్నికృష్ణన్ నాయర్. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లో ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌ఎమ్‌వీ-3ని వీఎస్‌ఎస్‌సీలో నిర్మించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ లోనూ ఉన్నికృష్ణన్ వీఎస్‌ఎస్‌సీలోని తన టీమ్‌తో కలిసి కీలక భూమిక పోషించారు.
డైరెక్టర్, యూఆర్‌ఎస్‌సీ- ఎమ్ శంకరన్ :
యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా 2021లో ఎమ్ శంకరన్ వ్యవహరించారు. ఈయన దృష్టిలో ఇస్రో అంటే ఓ పవర్‌హౌస్ . శాటిలైట్స్ కు అవసరమైన పవర్ సిస్టమ్‌ను డెవలప్ చేయడంలో ఈయనకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. భారత దేశ అవసరాలకు అనుగుణంగా శాటిలైట్స్‌ను రూపొందించడం యూఆర్‌ఎస్‌సీ బాధ్యత. ఫిజికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన శంకరన్ చంద్రయాన్-3 మిషన్‌లో అత్యంత కీలకమైన ల్యాండర్ ఎనర్జీని ఎగ్జామిన్ చేసేందుకు అసవరమైన చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో శంకరన్ చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్లలోనూ భాగస్వామ్యులయ్యారు.
ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్- వీ నారాయణన్ :
తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా వీ నారాయణన్ బాధ్యతలను వ్యవహరిస్తున్నారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవసరమైన థ్రస్టర్లను నారాయణన్ ఆధ్వర్యంలోనే డెవలప్ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన నారాయణన్, క్రయోజెనిక్ ఇంజిన్స్ నిర్మాణంలో నిపుణులు.
ఐఎస్‌టీఆర్‌ఏసీ డైరెక్టర్ -బీఎన్ రామకృష్ణ :
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ సెంటర్ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు బీఎన్ రామకృష్ణ . చంద్రయాణ్ 3లో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా సైంటిస్టులు అభివర్ణిస్తున్న ప్రాసెస్‌ను ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత పెద్దదైన 32-మీటర్ల డిష్ యాంటేనా ఈ సెంటర్లోనే ఉంది. ఈ డిష్ యాంటేనా సాయంతోనే సైంటిస్టులు విక్రమ్ ల్యాండర్‌కు కమాండ్స్ పంపుతారు.