ఈ ఏడాది చివర్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023 (Telangana Assembly Elections 2023) జరగనున్నాయి. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికలకూ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు ఐడీ తప్పనిసరి. 18 సంవత్సరాలు నిండిన వారంతా తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఓటరు గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. అయితే ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద గంటల కొద్దీ క్యూలో వేచి చూడాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని.. మీ మొబైల్ నుంచే అప్లై చేసుకోవచ్చు. అదెలాగంటే..
కొత్తగా ఓటర్ ఐడీ కోసం అప్లై చేసే వారు ..ముందుగా అధికారిక వెబ్సైట్ NVSP (National Voter's Service Portal)ని సంప్రదించాలి.
National Voter's Service Portal లింక్‌పై క్లిక్ చేస్తే మరో పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది.
ఆ పేజీలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న FORMS.. కుడివైపున SERVICES అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
FORMS సెక్షన్లోకి వెళితే.. అక్కడ ఫారం-6 కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే.. మరో పేజీలోకి తీసుకెళ్తుంది.అక్కడ LOGIN/ SIGN UP అని అడుగుతుంది.
కొత్త యూజర్ అయినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా SIGN UP కావాల్సి ఉంటుంది.
SIGN UP పూర్తయిన వెంటనే LOGIN పేజీలోకి తీసుకెళ్తుంది.
ఇక్కడ మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయ్యాక అక్కడ కనిపించే ఫారం-6లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
మీ వివరాలు నింపే క్రమంలో ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
1. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
2.డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డు
3.రెసిడెన్స్ ఫ్రూఫ్ కోసం మీ తండ్రి/భర్త ఆధార్ కార్డు
అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Preview and Submitపై క్లిక్ చేస్తే సరి.
మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్‌పై చూపిస్తుంది. దాంతోపాటు Reference Number జనరేట్ అవుతుంది.
ఈ Reference Numberను జాగ్రత్తగా పెట్టుకోండి.తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్‌ను చూసుకునేందుకు ఈ నెంబర్ కీలకం.
చివరగా ఓ వారం తర్వాత చెక్ చేసుకుంటే.. మీ కొత్త ఓటర్ ఐడీ కార్డు మీ కళ్ల ముందు కనిపిస్తుంది.
ఇక మీ ఓటర్ ఐడీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ముందుగా చెప్పిన కుడివైపున ఉన్న SERVICES సెక్షన్‌లోని TRACK Application Status అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి .అక్కడ మీ Reference Number ఎంటర్ చేసి, STATE సెలెక్ట్ చేసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
మీ కొత్త ఓటర్ ఐడీ అప్లికేషన్ కోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో.. చూశారుగా.. ఇంట్లోనే కూర్చుని రూపాయి ఖర్చు లేకుండా.. 10 నిమిషాల్లో ఓటర్ ఐడీకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకోండి.