రియల్ మీ కొత్త ఫోన్లు.. అమెజాన్లో భారీ డిస్కౌంట్

Update: 2023-07-06 17:01 GMT

రియల్ మీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఈ బ్రాండ్ నుంచి రెండు 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌ మీ నార్జో 60 సిరీస్లో realme narzo 5g, realme narzo 60 pro 5g మోడల్స్ లాంచ్ అయ్యాయి. realme narzo 60 pro 5g 1టీబీ భారీ స్టోరేజ్ కలిగివుండడం గమనార్హం. రియల్‌మీ నార్జో 60 5జీ రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 కాగా.. 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధరను రూ.19,999గా నిర్ణయించారు.

ఇక నార్జో 60 ప్రో 5జీలో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 8జీబీ+ 128జీబీ వేరింట్‌ ధర రూ.23,999, 2జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 1టీబీ వేరియంట్‌ ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మి నార్జో 60 5G ఫోన్ 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ + అమెల్డ్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేటు ప్యానెల్తో వస్తోంది. MediaTek డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌ కలిగి వుంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో Real me UI 4.0తో రన్ అవుతుంది.

ఈ ఫోన్లపై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. జులై 15 నుంచి ఇవి అమెజాన్‌లో అమ్మకానికి రాబోతున్నాయి. జులై 15, 16 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జరుగుతుంది. వీటిని ప్రీ ఆర్డర్‌ చేసుకుంటే రూ.1000 కూపన్‌ లభిస్తుంది. ఆ సేల్‌లో ఈ మొబైల్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలుపై రూ.1500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.






 


 


Tags:    

Similar News