యాపిల్ ఐఫోన్ లవర్స్ కు శుభవార్త. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. తర్వాత మోడల్స్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్న తరుణం దశల వారీగా ఐఫోన్ 14 సిరీస్ ను నిలిపేయనుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14ప్రోపై ఏకంగా రూ.66,999 డిస్కౌంట్ ఇస్తోంది. యాపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు.. ఐ వాచ్ లను కూడా విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఐఫోన్ 13 కన్నా తక్కువ ధరకు ఐఫోన్ 14 ప్రో లభించడం గమనార్హం. పోయినేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 ఉండగా.. ఫ్లిప్ కార్ట్ లో 14 ప్రొపై రూ.66,999 తగ్గించింది. ఈ డిస్కైంట్ లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్ సాక్షన్స్ పై అదనంగా రూ.3000 తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇతర స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ పై రూ.50వేలకే ఐఫోన్14 ప్రో దక్కించుకోవచ్చు.