నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 490 కేంద్ర కొలువులకు నోటిఫికేషన్

Byline :  Krishna
Update: 2023-08-30 07:16 GMT

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలకు నోటిపికేషన్ను విడుదల చేసింది. మొత్తం 490 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో అప్రెంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలోని ఈ నోటిఫికేషన్తో భర్తీ చేయనున్నారు.

ట్రేడ్ అప్రెంటీస్ - 150, టెక్నీషియన్ అప్రెంటీస్ - 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 230 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి 18 - 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..


అర్హతలు :

ట్రేడ్ అప్రెంటీస్ - 10వ తరగతి

టెక్నీషియన్ అప్రెంటీస్ - డిప్లొమా

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - BBA, BA, B.Com, B.Sc.

మిగితా వివరాల కోసం అభ్యర్థులు www.iocl.com వెబ్సైట్ చూడొచ్చు.



Tags:    

Similar News